ఐదేళ్ల తర్వాత రిటైరవుతానంటున్న కొరటాల శివ!

ABN , First Publish Date - 2020-04-16T19:24:24+05:30 IST

`మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను` వంటి వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు డైరెక్టర్ కొరటాల శివ.

ఐదేళ్ల తర్వాత రిటైరవుతానంటున్న కొరటాల శివ!

`మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను` వంటి వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు డైరెక్టర్ కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా `ఆచార్య` సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం కొరటాల శివ చాలా గ్యాప్ తీసుకున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కొరటాల శివ మాట్లాడారు. 


` అనుకోకుండా ఈ సినిమాకు మూడేళ్ల గ్యాప్ వచ్చేసింది. ఇకపై వేగంగా సినిమాలు చేయాలనుకుంటున్నా. నేను మహా అయితే మరో అయిదారేళ్లు ఫీల్డ్ లో వుంటానేమో. ఈ లోపే నేను చేయాలనుకుంటున్న సినిమాలన్నింటినీ చేసెయ్యాలి. సమయం వృథాగా పోతుంటే బాధగా ఉంద`ని కొరటాల చెప్పారు. అలాగే `ఆచార్య` సినిమాలో రామ్‌చరణ్ ఉన్నాడని కన్ఫామ్ చేశారు. అతని పక్కన హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదని తెలిపారు. 


Updated Date - 2020-04-16T19:24:24+05:30 IST

Read more