‘సత్య’ కొత్త జన్మనిచ్చింది: కోన వెంకట్

ABN , First Publish Date - 2020-07-03T21:22:38+05:30 IST

జేడీ చక్రవర్తి, ఊర్మిళ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం `సత్య`. 1998లో విడుదలైన ఈ చిత్రం కల్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఎంతో మంది

‘సత్య’ కొత్త జన్మనిచ్చింది: కోన వెంకట్

జేడీ చక్రవర్తి, ఊర్మిళ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం `సత్య`. 1998లో విడుదలైన ఈ చిత్రం కల్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఎంతో మంది జీవితాలను మలుపుతిప్పింది. ఈ సినిమా విడుదలై నేటితో (జులై 3) 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రచయిత కోన వెంకట్ ఈ చిత్రంతో తనకున్న అనుభవాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. చావు అంచు వరకు వెళ్లిన నా జీవితానికి ఈ చిత్రం మరో కొత్త జన్మని ఇచ్చిందని తెలిపారు. అవకాశం అనేది దేవుడితో సమానం. అవకాశం ఇచ్చేవాడు భగవంతుడి కంటే ఎక్కువ. ఈ విషయంలో వర్మకు, సత్య సినిమాకు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను అని కోన వెంకట్ అన్నారు.


‘‘22 సంవత్సరాల క్రితం నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. చావు అంచుకి వెళ్లిన నా జీవితానికి ఒక అవకాశం దక్కింది. ఒక కొత్త జన్మ. రచయితగా ఒక జననం. ఒక కొత్త ప్రయాణం. ‘రామ్ గోపాల్ వర్మ’ రూపంలో ఒక అవకాశం. ‘సత్య’ సినిమాతో ఒక గొప్ప పునాది. ఈ పునాది మీద ఇప్పటిదాకా 54 అంతస్థుల ఒక రచనా సౌథం నిర్మించుకునే అదృష్టం. మొదటి సినిమాలోనే మూడు బాధ్యతలు. నా జీవితాన్ని మార్చిన ఆ సినిమాని, మా రాముని, ఎప్పటికీ మరిచిపోను. సత్య- 3 జూలై 1998’’ అని కోన వెంకట్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.Updated Date - 2020-07-03T21:22:38+05:30 IST