శ్రీనువైట్లకు అందుకే దూరమయ్యా: కోనవెంకట్

ABN , First Publish Date - 2020-04-02T15:02:12+05:30 IST

దర్శకుడు శ్రీనువైట్ల, రచయిత కోనవెంకట్‌ది సూపర్‌హిట్ కాంబినేషన్.

శ్రీనువైట్లకు అందుకే దూరమయ్యా: కోనవెంకట్

దర్శకుడు శ్రీనువైట్ల, రచయిత కోనవెంకట్‌ది సూపర్‌హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్‌లో వచ్చిన `ఢీ`, `రెడీ`, `దూకుడు`, `బాద్‌షా` వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. అయితే `బాద్‌షా` తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన కోన వెంకట్.. శ్రీనువైట్ల గురించి మాట్లాడారు. 


`సంగీత దర్శకుడు పది ట్యూన్లు ఇస్తే దర్శకుడు ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు. అంత మాత్రాన ఆ ట్యూన్ తనదే అంటే ఎలా. నేను పది వెర్షన్లు రాస్తే ఒకటి దర్శకుడు ఎంచుకుంటాడు. ఇంకొంచెం బెటర్ చేసుండొచ్చు. అంత మాత్రాన ఆ క్రెడిట్ తనదే అంటే ఎలా. శ్రీనుతో అక్కడే సమస్య వచ్చింది. క్రెడిట్ తనకే దక్కాలనుకున్నాడు. నా శ్రమని గుర్తించలేదు. అందుకే అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అంతే తప్ప మా మధ్య పగలూ, ప్రతీకారాలూ లేవు. అన్నీ కుదిరితే మళ్లీ అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధమేన`ని కోన వెంకట్ అన్నారు. 

Updated Date - 2020-04-02T15:02:12+05:30 IST