కోమల్‌కి బాలీవుడ్‌ చాన్స్‌

ABN , First Publish Date - 2020-02-27T16:01:57+05:30 IST

2011లో ‘సట్టబడి కుట్రం’తో తమిళంలో పరిచయమైన నటి కోమల్‌శర్మ ఈ పదేళ్లలో ఐదు సినిమాల్లో మాత్రమే నటించింది. ఏడాదికి ఒక సినిమాలో మాత్రమే కనిపించిన ఈ

కోమల్‌కి బాలీవుడ్‌ చాన్స్‌

2011లో ‘సట్టబడి కుట్రం’తో తమిళంలో పరిచయమైన నటి కోమల్‌శర్మ ఈ పదేళ్లలో ఐదు సినిమాల్లో మాత్రమే నటించింది. ఏడాదికి ఒక సినిమాలో మాత్రమే కనిపించిన ఈ చెన్నై భామ కెరీర్‌ మళ్లీ ఊపందుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో ఒకటి, మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా బాలీవుడ్‌లోనూ ఛాన్స్‌ రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ప్రియదర్శన్‌ తెరకెక్కిస్తున్న ‘హంగామా2’ హిందీ చిత్రంలో ఆమె ఛాన్స్‌ వచ్చింది. ఒకేసారి మూడు భాషల్లో నటిస్తుండడంతో కోమల్‌ చాలా బిజీగా ఉంది. ఇకపోతే బాలీవుడ్‌ చిత్రంలో ఆమె గ్లామరస్‌ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-02-27T16:01:57+05:30 IST