`మాస్టర్`కి కోలీవుడ్ మద్దతు!

ABN , First Publish Date - 2020-12-30T20:41:04+05:30 IST

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటించిన తాజా చిత్రం `మాస్టర్`.

`మాస్టర్`కి కోలీవుడ్ మద్దతు!

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటించిన తాజా చిత్రం `మాస్టర్`. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాళవికా మోహనన్ కథానాయిక. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. కరోనాకు ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే లాక్‌‌డౌన్ కారణంగా కుదరలేదు. 


క్రిస్మస్‌కు విడుదల చేయాలనుకున్నా థియేటర్ల పరిస్థితులు ఎలా ఉంటాయోననే అనుమానంతో వెనక్కి తగ్గారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న పెద్ద హీరో సినిమా కావడంతో పలువురు కోలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాకు మద్దతు ప్రకటిస్తున్నారు. ధనుష్ వంటి పలువురు హీరోలు ఈ సినిమాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. హీరోలు మాత్రమే కాకుండా కోలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తం ఈ సినిమాకు అనుకూలంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూడమని రిక్వెస్ట్ చేస్తోంది.Updated Date - 2020-12-30T20:41:04+05:30 IST