విజ‌య్ సేతుప‌తి విలనిజంపై కోలీవుడ్‌ ఆరా

ABN , First Publish Date - 2020-04-20T14:15:19+05:30 IST

కోలీవుడ్ విలక్షణ నటుడు, మక్కల్‌సెల్వన్‌ విజయ్‌సేతుపతి ఒకపక్క మాస్‌ హీరోగా రాణిస్తూనే తన కంటే చిన్న హీరోల సినిమాల్లో కూడా విలన్‌గా నటించేందుకు ఆసక్తి చూపుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

విజ‌య్ సేతుప‌తి విలనిజంపై కోలీవుడ్‌ ఆరా

కోలీవుడ్ విలక్షణ నటుడు, మక్కల్‌సెల్వన్‌ విజయ్‌సేతుపతి ఒకపక్క మాస్‌ హీరోగా రాణిస్తూనే తన కంటే చిన్న హీరోల సినిమాల్లో కూడా విలన్‌గా నటించేందుకు ఆసక్తి చూపుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘మాస్టర్‌’లో విలన్‌గా నటించిన విజయ్‌ సేతుపతి.. తెలుగులో వర్ధమాననటుడు హీరోగా తెరకెక్కిన ‘ఉప్పెన’లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అదే సమయంలో అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నట్టు వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో టాలీవుడ్‌లో విజయ్‌సేతుపతి విలనీజం ఏ స్థాయిలో మెప్పిస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై కోలీవుడ్‌ ఫ్యాన్స్‌, దర్శకులు కూడా ఆసక్తి చూపుతున్నారు.

Updated Date - 2020-04-20T14:15:19+05:30 IST