దుర్గామాత ఉత్సవాల్లో సోనూ విగ్రహం
ABN , First Publish Date - 2020-10-23T21:26:10+05:30 IST
కోల్‌కత్తాలో దుర్గా మాత మండపాల వద్ద నిర్వాహకులు మాత్రం దుర్గామాత మండపాల వద్ద సోనూసూద్ విగ్రహాలను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

వినాయక చవితి, దుర్గాష్టమి వేడుకల్లో ట్రెండ్‌కు తగినట్లు విగ్రహాలు చేయడం మనవారికి అలవాటే. ఇప్పుడు దుర్గాష్టమి సందర్భంగా చాలా మంది దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. అయిత కోల్‌కత్తాలో దుర్గా మాత మండపాల వద్ద నిర్వాహకులు మాత్రం దుర్గామాత మండపాల వద్ద సోనూసూద్ విగ్రహాలను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో చాలా మందికి సోనూసూద్ సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. తిండిలేని వారికి తిండి ఏర్పాటు చేయడంతో పాటు, ఉద్యోగ అవకాశాలను కల్పించారు. అంతే కాకుండా చాలా మందినికి బస్సులు, ట్రెయిన్స్, విమానాల సహాయంతో వారి స్వస్థలాలకు చేర్చారు. ఇలా నిజ జీవితంలో హీరో అనిపించుకున్న సోనూసూద్‌పై ప్రేమను... కోల్‌కత్తాలో దుర్గామాత మండపాల వద్ద ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసి తమ ప్రేమను చాటుకుంటున్నారు నిర్వాహకులు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read more