ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత!
ABN , First Publish Date - 2020-11-04T19:46:48+05:30 IST
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. పలు తెలుగు, తమిళ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన కోలా భాస్కర్ (55) అనారోగ్యంతో కన్నుమూశారు. కోలా భాస్కర్ కొంతకాలంగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్నారు.
హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (బుధవారం) ఉదయం తుది శ్వాస విడిచారు. `ఖుషి`, `7/జీ బృందావన్ కాలనీ`, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`, ‘3’, ‘కుట్టి’ వంటి చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. కోలా భాస్కర్ అకాల మరణం టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.