శరవేగంగా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ షూటింగ్

ABN , First Publish Date - 2020-03-08T00:12:26+05:30 IST

‘రాజావారు రాణిగారు' చిత్రం ద్వారా హీరోగా పరిచమైన కిరణ్ అబ్బవరం, ‘టాక్సీవాలా’ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ జంటగా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై..

శరవేగంగా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ షూటింగ్

‘రాజావారు రాణిగారు' చిత్రం ద్వారా హీరోగా పరిచమైన కిరణ్ అబ్బవరం, ‘టాక్సీవాలా’ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ జంటగా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి  ‘ఎస్ఆర్ కళ్యాణమండపం- Est. 1975’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.  శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 


ఒక కళ్యాణమండపం చుట్టూ జరిగే క‌థ‌తో, రాయలసీమ నేపథ్యంలో సాగే కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో 'డైలాగ్ కింగ్' సాయి కుమార్ హీరో తండ్రి పాత్ర పోషిస్తున్నారు. త‌న కెరీర్‌లో తొలిసారిగా సాయికుమార్ రాయలసీమ మాండలికం, వ్యావహారిక శైలిని అనుసరించనున్నారట‌. అలానే తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని గొప్పగా చూపించే ప్ర‌య‌త్నం ఈ సినిమాలో జ‌రుగుతుంద‌ని చిత్ర బృందం తెలిపింది. మొదటి షెడ్యూల్ శ‌రవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ మార్చి 13 నుంచి రాజంపేటలోని అన్నమాచార్య కాలేజీలో జ‌ర‌గ‌నుందని ఎలైట్ టీమ్ ప్రకటించింది. 


Updated Date - 2020-03-08T00:12:26+05:30 IST