సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అఫీషియల్: ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో కింగ్ నాగ్

ABN, First Publish Date - 2020-07-27T23:24:11+05:30

కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే మేకర్స్ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే మేకర్స్ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై ఎటువంటి వార్తా రాలేదు. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా ప్రకటించారు. ఈ స్లిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కు ప్రవీణ్ సత్తారు రచన, దర్శకత్వం వహిస్తారని అధికారికంగా తెలియజేశారు.


ఈ చిత్రాన్ని తమ రెండు బ్యానర్ల మీద నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటి వరకు నాగార్జున, ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్ గురించి అనేకానేక వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ఈ చిత్రం బాలీవుడ్‌లోని ఓ చిత్రానికి రీమేక్ అనే వార్తలు బాగా వినవచ్చాయి. కానీ ఇప్పుడు నిర్మాతలు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ప్రవీణ్ సత్తారే అని ప్రకటించడంతో.. ఓ ఫ్రెష్ స్క్రిప్ట్‌తోనే ఈ చిత్రం తెరకెక్కనుందనేది అర్థమవుతోంది.

Updated Date - 2020-07-27T23:24:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!