‘కిక్’ శ్యామ్ అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-28T16:57:21+05:30 IST

ప్రముఖ నటుడు కిక్ శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

‘కిక్’ శ్యామ్ అరెస్ట్

ప్రముఖ నటుడు కిక్ శ్యామ్‌ను మంగళవారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలో శ్యామ్ ఓ ఫోక‌ర్ క్ల‌బ్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ల‌బ్‌లో శ్యామ్ గ్యాంబ్లింగ్ చేస్తున్నార‌ని పోలీసులు గుర్తించ‌డంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమ‌తులు లేకుండా శ్యామ్ పేకాట‌, బెట్టింగులు నిర్వ‌హిస్తుండ‌టంతో శ్యామ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టుడిగా శ్యామ్‌కి మంచి గుర్తింపే ఉంది. ఈయ‌న‌కు తెలుగులో ‘కిక్’ సినిమా చాలా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. త‌ర్వాత ‘కిక్ 2, రేసుగుర్రం, ఊస‌ర‌వెళ్లి, క‌త్తి’ వంటి చిత్రాల్లో న‌టించారు.  

Updated Date - 2020-07-28T16:57:21+05:30 IST