పవన్‌ను కలిసిన కిచ్చ సుదీప్!
ABN , First Publish Date - 2020-10-05T21:21:17+05:30 IST
జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో కన్నడ ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ సమావేశమయ్యారు

జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో కన్నడ ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ సమావేశమయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో పవన్‌ను సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్‌కు మొక్కలను బహూకరించారు.
వీరిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్‌లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాను నటిస్తున్న సినిమాల గురించి పవన్‌కు సుదీప్ వివరించారు. అలాగే వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు.