`కబీర్‌సింగ్`పై విమర్శలు.. కియార స్పందన!

ABN , First Publish Date - 2020-06-12T23:41:07+05:30 IST

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన `అర్జున్‌రెడ్డి`తో యంగ్ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో ప్రముఖ హీరోగా ఎదిగాడు

`కబీర్‌సింగ్`పై విమర్శలు.. కియార స్పందన!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన `అర్జున్‌రెడ్డి`తో యంగ్ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో ప్రముఖ హీరోగా ఎదిగాడు. అదే సినిమా హిందీ రీమేక్ `కబీర్‌సింగ్`తో హీరోయిన్ కియారా ఆడ్వాణీ బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అయితే `కబీర్‌సింగ్` సినిమాకు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దర్శకుడు, హీరో, హీరోయిన్‌పై విమర్శకులు విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఆ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించింది. 


`కబీర్‌సింగ్`పై విమర్శకుల తీరు గురించి కియార ఇటీవల స్పందించింది. `ఆ సినిమా విషయంలో చాలా విమర్శలు ఎదురయ్యాయి. దర్శకుడికి ఓ ఆలోచనా విధానం ఉంటుంది. నటులుగా మాకు ఓ ఆలోచన ఉంటుంది. ప్రేక్షకులకు వారిదైన దృక్కోణం ఉంటుంది. అయితే మీరు ప్రేక్షకుల జ్ఞానాన్ని అగౌరవపరచకూడదు. ఓ సినిమా గురించి అంత చర్చ జరగడం మంచిదే. న్యాయమో, కాదో తెలియదు కానీ `కబీర్‌సింగ్` పట్ల విమర్శకులు కఠినంగా వ్యవహరించార`ని కియార అభిప్రాయపడింది. 

Updated Date - 2020-06-12T23:41:07+05:30 IST