కియారకు కోపమొచ్చింది!

ABN , First Publish Date - 2020-12-15T20:04:30+05:30 IST

`భరత్ అనే నేను`, `వినయ విధేయ రామ` వంటి తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ కియారా ఆడ్వాణీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి జోరుమీదుంది.

కియారకు కోపమొచ్చింది!

`భరత్ అనే నేను`, `వినయ విధేయ రామ` వంటి తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ కియారా ఆడ్వాణీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి జోరుమీదుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన `ఇందూ కీ జవాని` గత శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి వచ్చిన కియారకు ఓ జర్నలిస్ట్ చిరాకు తెప్పించారు. 


జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెబుతున్న కియారను ఓ జర్నలిస్టు `కైరా` అని పిలిచారు. దీంతో అసహనానికి గురైన కియార `మీరు నన్ను ఏమని పిలిచారు? `కైరా` అనా? `కియార` అనా? నా పేరును తప్పుగా పిలిచినందుకు మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. దయచేసి నన్ను `కియార` అని పిలవండ`ని చెప్పింది. 

Updated Date - 2020-12-15T20:04:30+05:30 IST

Read more