ఆ సినిమా చాలా నిరాశపరిచింది: కియార
ABN, First Publish Date - 2020-12-01T18:23:26+05:30
అటు బాలీవుడ్‌తోపాటు ఇటు దక్షిణాదిన కూడా గుర్తింపు దక్కించుకున్న కథానాయిక కియారా ఆడ్వాణీ.
అటు బాలీవుడ్‌తోపాటు ఇటు దక్షిణాదిన కూడా గుర్తింపు దక్కించుకున్న కథానాయిక కియారా ఆడ్వాణీ. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ కియారానే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియార తన కెరీర్ ఆరంభ రోజుల గురించి మాట్లాడింది. తొలి సినిమా తీవ్ర నిరాశను కలిగించిందని, తనకు రెండో అవకాశం వస్తుందని కూడా ఊహించలేదని తాజాగా కియార ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
`చాలా మంది నా తొలి సినిమా `ధోనీ` అనుకుంటారు. అది నిజం కాదు. నా తొలి సినిమా 2014లో వచ్చిన `ఫగ్లీ`. ఆ సినిమా ఫ్లాపై నా ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. నాకు రెండో అవకాశం వస్తుందని కూడా అనుకోలేదు. నా కెరీర్ అయిపోయినట్టేనని నిరాశలో కూరుకుపోయా. ఆ తర్వాత ఎన్నో ఆడిషన్లు ఇచ్చాను. చివరికి `ధోనీ` అవకాశం వచ్చింది. ఆ సినిమాతో దేశమంతా పరిచయమయ్యాన`ని కియార పేర్కొంది.