మా బ్యాచ్‌ను మిస్సవుతున్నా: ఖుష్బూ

ABN , First Publish Date - 2020-08-27T20:19:32+05:30 IST

ఎనభయ్యో దశకంలో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన దక్షిణాది నటులందరూ `క్లాస్ ఆఫ్ ఎయిటీస్`

మా బ్యాచ్‌ను మిస్సవుతున్నా: ఖుష్బూ

ఎనభయ్యో దశకంలో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన దక్షిణాది నటులందరూ `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ఓ గ్రూపుగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వీరంతా ప్రతి ఏడాది ఒకరోజున ఏదో ఒక దక్షిణాది నగరంలో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు. పార్టీ చేసుకుంటారు.  


ఈ ఏడాది కరోనా కారణంగా ఆ బ్యాచ్ కలవడం కుదరలేదు. దీంతో నటి ఖుష్బూ ట్విటర్ ద్వారా తన బాధను వ్యక్తం చేశారు. ``క్లాస్ ఆఫ్ ఎయిటీస్`.. మా ఫ్యామిలీ అందర్నీ మిస్సవుతున్నా. మా నవ్వులను, మా చాయ్ సమావేశాలను, మా కౌగలింతలను, మా డ్యాన్స్‌లను, మా కన్నీళ్లను, మా భయాలను మిస్సవుతున్నా` అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు. గతంలో జరిగిన `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` సమావేశం ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోను తన ట్విటర్ ఫ్రొఫైల్ పిక్‌గా మార్చుకున్నారు. 

Updated Date - 2020-08-27T20:19:32+05:30 IST