`కేజీఎఫ్‌-2` సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

ABN , First Publish Date - 2020-12-21T18:53:45+05:30 IST

దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న `కేజీఎఫ్-2` సర్‌ప్రైజ్ వచ్చేసింది.

`కేజీఎఫ్‌-2` సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న `కేజీఎఫ్-2` సర్‌ప్రైజ్ వచ్చేసింది. యశ్ లుక్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ అభిమానులతో పంచుకున్నారు. అలాగే హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 8న `రాఖీభాయ్` సామ్రాజ్యానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 


`కేజీఎఫ్`కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవలె క్లైమాక్స్ సన్నివేశాలను భారీగా చిత్రీకరించారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. Updated Date - 2020-12-21T18:53:45+05:30 IST