‘కె.జి.య‌ఫ్ చాప్టర్ 2’... స‌ర్‌ప్రైజ్ అదేనా?

ABN , First Publish Date - 2020-07-27T16:40:51+05:30 IST

అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్‌ చేసిన ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’కి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2‘ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

‘కె.జి.య‌ఫ్ చాప్టర్ 2’... స‌ర్‌ప్రైజ్ అదేనా?

అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్‌ చేసిన ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’కి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2‘ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ భారీ బడ్జెట్‌తో అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బుధ‌వారం ఉద‌యం ప‌ది గంట‌ల‌కు సర్‌ప్రైజ్ ఇస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. అయితే ఈ స‌ర్‌ప్రైజ్ ఏంటో త‌మ‌కు తెలిసిపోయింద‌ని అంటున్నారు అభిమానులు. అస‌లు విష‌య‌మేమంటే జూలై 29న సంజ‌య్ ద‌త్ పుట్టిన‌రోజు. ఈ బాలీవుడ్ స్టార్ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌2’లో అధీర అనే కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సంజ‌య్ ద‌త్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌2’లో ఆయ‌న లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేయ‌నుంద‌ని అంటున్నారు ఫ్యాన్స్‌. ఈ సస్పెన్స్‌కు తెర‌ప‌డాలంటే జూలై 29 వ‌ర‌కు ఆగాల్సిందే. 

Updated Date - 2020-07-27T16:40:51+05:30 IST

Read more