తెలుగు ఛానెల్‌పై ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1’ నిర్మాత‌ల ఆగ్ర‌హం

ABN , First Publish Date - 2020-05-12T18:27:52+05:30 IST

ఓ తెలుగు లోక‌ల్ ఛానెల్ ఒక‌టి ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1’ను త‌మ ఛానెల్‌లో ప్ర‌సారం చేసింది. దీనిపై నిర్మాత‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

తెలుగు ఛానెల్‌పై ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1’ నిర్మాత‌ల ఆగ్ర‌హం

‘బాహుబ‌లి’ త‌ర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీ విజ‌యం సాధించిన ద‌క్షిణాది సినిమా ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1’. అలాగే కన్నడ సినిమా స్థాయిని అమాంతం ఎన్నో రెట్లు పెంచిన సినిమా ఇది. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను నిర్మాత‌లు ఇంకా ఎవ‌రికీ ఇవ్వ‌లేదు. ఈ త‌రుణంలో ఓ తెలుగు లోక‌ల్ ఛానెల్ ఒక‌టి ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1’ను త‌మ ఛానెల్‌లో ప్ర‌సారం చేసింది. దీనిపై నిర్మాత‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా వారు స్పందిస్తూ ‘‘దాదాపు శాటిలైట్ డీలింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో ఓ తెలుగు లోక‌ల్ ఛానెల్ కేజీయ‌ఫ్ ఛాప్టర్ 1ను ప్ర‌సారం చేసింది. వారిపై మేం చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోబోతున్నాం. వారికి స‌మ‌న్లు జారీ చేస్తాం. మా వ‌ద్ద స‌ద‌రు ఛానెల్‌లో సినిమా ప్రసార‌మైన‌ట్లు ఆధారాలున్నాయి. వీడియో కూడా సేవ్ చేసి పెట్టుకున్నాం’’ అన్నారు. 

Updated Date - 2020-05-12T18:27:52+05:30 IST