దుబాయ్‌లో కీర్తి సందడి!
ABN , First Publish Date - 2020-12-01T16:49:30+05:30 IST
`మహానటి` కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

`మహానటి` కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. లాక్‌డౌన్ సమయంలో రెండు సినిమాలను విడుదల చేసిన కీర్తి.. ప్రస్తుతం యంగ్ హీరో నితిన్‌తో కలిసి `రంగ్ దే` షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఆ సినిమా సెట్లో కీర్తి నిద్రపోతున్న ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.
షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోందంటూ నితిన్ ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాజాగా కీర్తి స్పందించింది. `షూటింగ్ సెట్స్‌లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా. పగ తీర్చుకుంటాన`ని కామెంట్ చేసింది. అలాగే దుబాయ్‌లో దిగిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది.