ఈ మిస్‌ ఇండియాది చాయ్‌ బిజినెస్‌!

ABN , First Publish Date - 2020-10-25T06:05:50+05:30 IST

కీర్తి సురేశ్‌ నటించిన ‘మిస్‌ ఇండియా’ నవంబర్‌ 4వ తేదీన నెట్‌ఫిక్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఒక సామాన్యమైన అమ్మాయి.. టీ వ్యాపారంలోకి ప్రవేశించి.. దానిలో ఎదురయ్యే రకరకాల సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా విజయం సాధించిందనేదే ఈ సినిమా ప్రధానాంశం...

ఈ మిస్‌ ఇండియాది చాయ్‌ బిజినెస్‌!

కీర్తి సురేశ్‌ నటించిన ‘మిస్‌ ఇండియా’ నవంబర్‌ 4వ తేదీన నెట్‌ఫిక్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఒక సామాన్యమైన అమ్మాయి.. టీ వ్యాపారంలోకి ప్రవేశించి.. దానిలో ఎదురయ్యే రకరకాల సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా విజయం సాధించిందనేదే ఈ సినిమా ప్రధానాంశం. ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ పేరు సంయుక్త. ఆమె పెట్టిన టీ బ్రాండ్‌ పేరు- ‘మిస్‌ ఇండియా’. ‘‘ఈ సినిమా ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిని ఇస్తుందని.. వారి కలలను సాకారం చేసుకోవటానికి ఆలంబనగా నిలుస్తుందని భావిస్తున్నాను’’ అని కీర్తి సురేశ్‌ ఈ చిత్రం గురించి పేర్కొన్నారు. 


ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌తో పాటుగా నదియా, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ మొదలైన వారు నటించారు. తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమాకు డైరక్టర్‌ వై. నరేంద్రనాథ్‌, నిర్మాత మహేశ్‌ ఎస్‌. కోనేరు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

Updated Date - 2020-10-25T06:05:50+05:30 IST

Read more