అమితాబ్‌ను కేబీసీ ఎలా ఆదుకున్నదంటే....

ABN , First Publish Date - 2020-09-28T14:29:21+05:30 IST

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ఈ రోజు(సెప్టెంబరు28) నుంచి ప్రారంభం కానుంది. కరోనా కారణంగా ఈసారి షోలో పలు మార్పులు చేశారు.

అమితాబ్‌ను కేబీసీ ఎలా ఆదుకున్నదంటే....

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ఈ రోజు(సెప్టెంబరు28) నుంచి ప్రారంభం కానుంది. కరోనా కారణంగా ఈసారి షోలో పలు మార్పులు చేశారు. ఈ కార్యక్రమం అమితాబ్ జీవితానికి ఎంతో కీలకమైనది. 20 ఏళ్ల క్రితం రూ. 90 కోట్ల అప్పును తీర్చడంలో అమితాబ్‌కు ఈ షో దోహదపడింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో బిగ్ బీ మాట్లాడుతూ ‘ఒకానొకప్పుడు ఈ షో చేయడం నాకు ఎంతో అత్యవసరమయ్యింది. ప్రొఫిషనల్‌గా ఈ షోను ప్రారంభించాను. ఈ షో రుణాలు తీర్చడంలో నాకు ఎంతో సహాయాన్ని అందించిందని తెలిపారు. కాగా మీడియాకు అందిన సమాచారం ప్రకారం కేబీసీ తొలి సీజన్‌లో నిర్వహించిన 58 ఎపిసోడ్‌లకు గాను బీగ్‌ బీ రూ. 15 కోట్ల పారితోషికాన్ని అందుకున్నారు. 1996లో ఈ కంపెనీ బెంగళూరులో జరిగిన మిస్ వరల్డ్ పోటీల మేనేజ్‌మెంట్ భాధ్యతలను చేపట్టింది. ఈ నేపధ్యంలో కంపెనీకి రూ. 4 కోట్ల నష్టం వచ్చింది. దీంతో బిగ్ బీ సంస్థ ప్రొఫెషనల్ మేనేజర్లను మార్చివేసింది. ఇదే సమయంలో కంపెనీ బ్యానర్‌పై రూపొందించిన ‘మృత్యుదాత’ తదతర సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో కంపెనీ అప్పుల్లో కూరుకుపోయింది. అమితాబ్‌కు ఈ షో చేసేందుకు ఆఫర్ వచ్చినప్పుడు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులు బుల్లితెర కోసం పనిచేయవద్దని చెప్పారు. టీవీ షో చేస్తే స్టార్‌డమ్ తగ్గుతుందని వారు భావించారు. అమితాబ్‌కు కూడా ఈ షో చేయడం అంతగా ఇష్టం లేదు. అయితే బిగ్ బీకి ఈ షో గురించి తెలియజేసేందుకు నిర్వాహకులు అతనిని లండన్ తీసుకువెళ్లారు. అక్కడ బిగ్ బీకి వారు ‘హూ వాంట్స్ టు బీ ఏ బిలియనీర్’ షో సెట్ చూపించారు. దీంతో బిగ్ బీ ఈ కార్యక్రమానికి అమితంగా ప్రభావితుడై హిందీలో ఈ షో చేసేందుకు అంగీకరించారు. అయితే ఈ షో కూడా ‘హూ వాంట్స్ టు బీ ఏ బిలియనీర్’ మాదిరిగానే ఉండాలని కండీషన్ పెట్టారు. కాగా 1995లో అమితాబ్ స్వయంగా ‘అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్’(ఏబీసీఎల్) పేరిట ఒక కంపెనీని నెలకొల్పారు. తొలి ఏడాది ఈ కంపెనీ రూ. 65 కోట్ల టర్న్ఓవర్ సాధించింది. రూ 15 కోట్ల లాభం వచ్చింది. అయితే రెండవ ఏడాది సంస్థ అనుకున్నంతగా అభివృద్ది చెందలేదు. 


1999 నాటికి కంపెనీలోని ఉద్యోగులకు సైతం జీతం ఇవ్వలేని స్థితికి అమితాబ్ చేరుకున్నారు. ఫిల్మ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఫండ్ నిలిచిపోయింది. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. బిగ్ బీ సన్నిహితులు అతనితో కంపెనీ మూసివేయమని సలహా ఇచ్చారు. అయితే అమితాబ్ అందుకు ఒప్పుకోలేదు. ఈ సమయంలో అమితాబ్ చేతిలో సినిమాలు కూడా లేవు. సరిగ్గా ఇదే సమయంలో కేబీసీ షో హోస్ట్ చేసేందుకు అమితాబ్ ఒప్పుకున్నారు. మొదట్లో ఈ షోకు ‘కౌన్ బనేగా లఖ్‌పతి’ అని పేరు పెట్టారు. అప్పట్లో గరిష్ట ప్రైజ్ మనీ లక్ష రూపాయలుగా నిర్ణయించారు. ఈ షోకు విపరీతమైన ప్రజాదరణ దక్కింది.  తరువాతి కాలంలో ఈ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ వరకూ ఎదిగింది. 

Updated Date - 2020-09-28T14:29:21+05:30 IST