ఏ దుస్తుల్లో ఉన్నా రెడీ!

ABN , First Publish Date - 2020-08-08T06:30:35+05:30 IST

లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన కట్రీనా కైఫ్‌ ఆ సమయంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. వంటా వార్పు, కేకులు, పాస్తా ఇలా తినుబండారాలు తయారు చేయడమే కాకుండా...

ఏ దుస్తుల్లో ఉన్నా రెడీ!

లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన కట్రీనా కైఫ్‌ ఆ సమయంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. వంటా వార్పు, కేకులు, పాస్తా ఇలా తినుబండారాలు తయారు చేయడమే కాకుండా  ఇంటిని శుభ్రం చేయడం లాంటి పనులెన్నో చేశారు. అన్‌లాక్‌ 3.0తో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కాలు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో కట్రీనా కూడా ఉన్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఆమెకు  ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను చాలా మిస్‌ అవుతున్నారట. లెగ్గిన్‌, కుర్తా ధరించి క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుని కూర్చొన్న ఓ ఫొటోను కట్రీనా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ‘‘క్రికెట్‌ను చాలా మిస్‌ అవుతున్నా. వేషధారణ సరిగ్గా ఉన్నా లేకపోయినా క్రికెట్‌ ఆడటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఆమె కథానాయికగా నటించిన ‘సూర్య వంశీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 


Updated Date - 2020-08-08T06:30:35+05:30 IST

Read more