కృష్ణ, ఎస్వీఆర్‌.. 'కత్తుల రత్తయ్య'కు 48 ఏళ్ళు

ABN , First Publish Date - 2020-10-27T04:15:42+05:30 IST

సూపర్ స్టార్‌ కృష్ణ, విజయనిర్మల, ఎస్వీ రంగారావు ప్రధాన తారాగణంగా రూపుదిద్దుకున్న 'కత్తుల రత్తయ్య' చిత్రం 48 ఏళ్లు పూర్తి చేసుకుంది

కృష్ణ, ఎస్వీఆర్‌.. 'కత్తుల రత్తయ్య'కు 48 ఏళ్ళు

సూపర్ స్టార్‌ కృష్ణ, విజయనిర్మల, ఎస్వీ రంగారావు ప్రధాన తారాగణంగా రూపుదిద్దుకున్న 'కత్తుల రత్తయ్య' చిత్రం 48 ఏళ్లు పూర్తి చేసుకుంది. 26 అక్టోబర్‌, 1972లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. శ్రీ ఉమా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్‌.ఎన్‌. భట్‌ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ దర్శకుడు. విఎస్‌ఆర్‌ స్వామి సినిమాటోగ్రఫీ అందించగా.. విశ్వప్రసాద్‌ కథ, మాటలు అందించారు. ఇక సత్యం సంగీతంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలోని 'ఓహోహో చేమంతి వయ్యారి పూబంతి..', 'రత్తయ్య మామా రంజైన మామా..', 'ఎంతో మంచిరోజు సంతోషించే రోజు'.. వంటి పాటలు ఇప్పటికీ అక్కడక్కడ వినబడుతూనే ఉంటాయి.

Updated Date - 2020-10-27T04:15:42+05:30 IST