నేనూ బాధితురాలినే: పాయల్ ఉదంతంపై కస్తూరి షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2020-09-24T16:09:26+05:30 IST

సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని, తాను కూడా బాధితురాలినేనని సీనియర్ హీరోయిన్ కస్తూరి వ్యాఖ్యానించింది.

నేనూ బాధితురాలినే: పాయల్ ఉదంతంపై కస్తూరి షాకింగ్ కామెంట్స్

సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని, తాను కూడా బాధితురాలినేనని సీనియర్ హీరోయిన్ కస్తూరి వ్యాఖ్యానించింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పాయల్ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు అనురాగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. 


పాయల్ చేసిన ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని సీనియర్ హీరోయిన్ కస్తూరి అభిప్రాయపడింది. అనురాగ్‌పై పాయల్ చేసిన ఆరోపణలు కోర్టులో నిలబడవని, ఆధారాలు లేకుండా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. `ఇలాంటి పరిస్థితి మీ కుటుంబంలో ఎవరికైనా వస్తే ఇలాగే మాట్లాడతారా?` అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన కస్తూరి.. `నా కుటుంబంలో ఏంటి? నేనే అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా. నేను కూడా దానికి బాధితురాలినేన`ని రిప్లై ఇచ్చింది. 
Updated Date - 2020-09-24T16:09:26+05:30 IST