మెగాస్టార్‌తో ఇది చిరకాల జ్ఞాపకం: కార్తికేయ

ABN , First Publish Date - 2020-07-16T16:49:05+05:30 IST

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు సామాన్య ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు

మెగాస్టార్‌తో ఇది చిరకాల జ్ఞాపకం: కార్తికేయ

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు సామాన్య ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చెబుతున్నారు. మాస్క్ గురించి అవగాహన కలిగిస్తూ తాజాగా రూపొందిన వీడియోలో మెగాస్టార్ చిరంజీవితోపాటు యంగ్ హీరో కార్తికేయ కూడా నటించాడు. 


ఆ వీడియోను, మెగాస్టార్‌తో నటించిన అనుభవాన్ని కార్తికేయ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. `కరోనా భయం, షూటింగ్‌ని మిస్ అవడం, తర్వాత ఎలా ఉంటుందనే భయం.. ఈ ఒక్క వీడియోతో అన్నీ తీరిపోయాయి. ఓ మంచి పని కోసం మెగాస్టార్‌గారితో కలిసి నేను ఓ వీడియో చేశాను. నా సినిమాలు పది విడుదలైనా ఈ కిక్ రాదు. మెగాస్టార్ సర్‌తో ఇది నా జీవితకాల జ్ఞాపకం` అని కార్తికేయ ట్వీట్ చేశాడు. 
Updated Date - 2020-07-16T16:49:05+05:30 IST