గుడ్ న్యూస్ చెప్పిన కార్తీ!

ABN , First Publish Date - 2020-10-21T02:04:16+05:30 IST

తమిళ హీరో కార్తీ కుటుంబం మరింత పెద్దది అయింది. ఆయన మరోసారి తండ్రి అయ్యాడు.

గుడ్ న్యూస్ చెప్పిన కార్తీ!

తమిళ హీరో కార్తీ కుటుంబం మరింత పెద్దది అయింది. ఆయన మరోసారి తండ్రి అయ్యాడు. తన భార్య మగ బిడ్డకు జన్మినిచ్చినట్టు కార్తీ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 2011లో కార్తీ, రంజనీ వివాహం చేసుకున్నారు. 2013లో వాళ్లకు ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ఉమయాళ్‌ అని పేరు పెట్టారు. 


తాజాగా రంజనీ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. `మగ బిడ్డ జన్మించాడు. ఈ గొప్ప ప్రయాణంలో మాకు అండగా నిలిచిన వైద్యులకు, నర్సులకు కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు. చిన్నారికి మీ అందరి ఆశీర్వాదాలూ కావాలి. థాంక్ గాడ్` అంటూ కార్తీ ట్వీట్ చేశాడు. Updated Date - 2020-10-21T02:04:16+05:30 IST