షాహిద్‌తో బ్రేకప్‌ గురించి కరీనా స్పందన!

ABN , First Publish Date - 2020-02-21T17:01:06+05:30 IST

`జబ్ వుయ్ మెట్` సినిమాతో బాలీవుడ్‌లో గుర్తింపు సంపాదించుకున్నారు షాహిద్ కపూర్, కరీనా కపూర్.

షాహిద్‌తో బ్రేకప్‌ గురించి కరీనా స్పందన!

`జబ్ వుయ్ మెట్` సినిమాతో బాలీవుడ్‌లో గుర్తింపు సంపాదించుకున్నారు షాహిద్ కపూర్, కరీనా కపూర్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కొంతకాలం పాటు డేటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత సైఫ్ అలీఖాన్‌ను కరీనా పెళ్లి చేసుకోగా.. మీరాతో షాహిద్ పెళ్లిపీటలెక్కాడు. 


తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరీనా.. షాహిద్‌తో తన బ్రేకప్ గురించి స్పందించింది. ``జబ్ వియ్ మెట్`, `తషాన్` సినిమాలకు మధ్య నా జీవితంలో చాలా జరిగింది. `జబ్ వియ్ మెట్` సినిమా కథ ముందుగా షాహిద్ విని నన్ను ఆ సినిమా చేయమని చెప్పాడు. అలా ఆ సినిమాలో నేను భాగమయ్యాను. మా ఇద్దిరి జీవితాల్లో విధికి ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. అందుకే మేం విడిపోయాం. ఎవరి దారులు వారు చూసుకున్నామ`ని కరీనా చెప్పింది.  `   


Updated Date - 2020-02-21T17:01:06+05:30 IST