సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆ సినిమాలో న్యూడ్ ఎందుకు చేశానంటే... వెల్లడించిన అగ్రహీరోయిన్!

ABN, First Publish Date - 2020-03-09T12:13:09+05:30

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ వైవిధ్యభరిత పాత్రలు పోషిస్తూ తానేమిటో నిరూపించుకుంది. ‘చమేలీ’, ‘హీరోయిన్’ చిత్రాలలో అత్యంత శక్తివంతమైన పాత్రలు పోషించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ వైవిధ్యభరిత పాత్రలు పోషిస్తూ తానేమిటో నిరూపించుకుంది. ‘చమేలీ’, ‘హీరోయిన్’ చిత్రాలలో అత్యంత శక్తివంతమైన పాత్రలు పోషించింది. ఈ రెండు పాత్రలు ఆమె కెరియర్‌లో ప్రత్యేకమైనవిగా నిలిచిపోయాయి. ఇటీవల కరీనా ఒక షోలో తన టాప్ ఫైవ్ క్యారెక్టర్స్ గురించి చెప్పింది. వాటిలో ‘హీరోయిన్’ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ఒకటని తెలిపింది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కరీనా కపూర్ న్యూడ్ సీన్  చేసింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఏమనుకున్నా సరే ఈ సినిమాలో నటించినందుకు ఎంతో గర్వపడుతున్నానని తెలిపింది. ఈ సినిమా కోసం తన వంతుగా వందశాతం కష్టపడ్డానని, ఈ సినిమాలో న్యూడ్ సీన్ కూడా చేశానని పేర్కొంది. ఇంతలా ఏ సినిమా కోసం కష్టపడలేదు. అయితే ప్రేక్షకులు తనను అలా చూసేందుకు ఇష్టపడలేదని అన్నారు. మధుర్ బండార్కర్ అద్భుతమైన డైరెక్టర్ అని, నటులలోని ప్రతిభను వెలికి తీయడంలో అతను ముందుంటారని అన్నారు.

Updated Date - 2020-03-09T12:13:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!