బేబీ బంప్‌తోనే షూటింగ్‌కు కరీనా!

ABN , First Publish Date - 2020-10-28T17:09:48+05:30 IST

బాలీవుడ్ బ్యూటీ కరీన్ కపూర్ రెండోసారి తల్లి కాబోతోంది.

బేబీ బంప్‌తోనే షూటింగ్‌కు కరీనా!

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ రెండోసారి తల్లి కాబోతోంది. తాను గర్భవతినని ఆగస్టులోనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. గర్భవతి అయినప్పటికీ కరీనా బయట బాగానే కనిపిస్తోంది. సాధారణంగా కొందరు హీరోయిన్లు తమ గర్భాన్ని చూపించుకోడానికి యిష్టపడరు. పైగా ఇది కరోనా సీజన్ కావడంతో బయటకు రావడానికి మరింత భయపడతారు.


కరీనా మాత్రం అలాంటివేవీ పట్టించుకోవడం లేదు. తాజాగా బేబీ బంప్‌తోనే కరీనా షూటింగ్‌లో పాల్గొంది. తన అక్క కరిష్మా కపూర్‌తో కలిసి షూటింగ్‌కు హాజరైంది. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం కరీనా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ షూటింగ్ తాలూకు బ్యాక్ స్టేజ్ వీడియోను కరీనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. Updated Date - 2020-10-28T17:09:48+05:30 IST