సినీ కార్మికులకు కరాటం రాంబాబు లక్ష విరాళం
ABN , First Publish Date - 2020-03-30T15:52:28+05:30 IST
ప్రముఖ నిర్మాత సౌభాగ్య థియేటర్స్ జంగారెడ్డిగూడెంకు చెందిన కరాటం రాంబాబు కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు లక్ష రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా చిరంజీవి అధ్యక్షతన ప్రారంభమైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తాయి. ఛారిటీ ఛైర్మన్‌గా చిరంజీవి, సభ్యులు ఇచ్చిన పిలుపు మేరకు ‘సీసీసీ-మనకోసం’ సంస్థకు పలువురు తారలు తమ వంతుగా విరాళాలను ప్రకటించారు. తాజాగా ప్రముఖ నిర్మాత సౌభాగ్య థియేటర్స్ జంగారెడ్డిగూడెంకు చెందిన కరాటం రాంబాబు కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు లక్ష రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.