చాలా కాలం తర్వాత బయటకు కరణ్ జోహార్!

ABN , First Publish Date - 2020-09-16T21:38:16+05:30 IST

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

చాలా కాలం తర్వాత బయటకు కరణ్ జోహార్!

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. బాలీవుడ్‌లోని బంధుప్రీతికి, స్టార్ వారసత్వానికి కరణ్ జోహారే కారణమని కంగన వంటి సెలబ్రిటీలే కాదు.. సామాన్యులు కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. 


తనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినా కరణ్ జోహార్ ఇప్పటివరకు స్పందించలేదు. సుశాంత్ మరణించిన నాటి నుంచి కరణ్ బయట ఎక్కడా కనిపించలేదు. చాలా కాలం తర్వాత తాజాగా కరణ్ జోహార్ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. తన పిల్లలతో కలిసి వెకేషన్ కోసం గోవా బయలుదేరినట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా అనుభవించిన భయంకరమైన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకే కరణ్ గోవా పయనమైనట్టు సమాచారం. 

Updated Date - 2020-09-16T21:38:16+05:30 IST