పూరీ జగన్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన క‌ర‌ణ్ జోహార్

ABN , First Publish Date - 2020-04-20T00:17:29+05:30 IST

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పూరీ జగన్ దర్శకుడిగా ఏప్రిల్ 20కి

పూరీ జగన్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన క‌ర‌ణ్ జోహార్

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పూరీ జగన్ దర్శకుడిగా ఏప్రిల్ 20కి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కరణ్ జోహార్.. విజయ్ దేవరకొండతో పూరీ చేస్తున్న చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


పూరి జగన్నాధ్ డైరెక్టర్‌గా చేసిన తొలి చిత్రం ‘బద్రి’ ఏప్రిల్ 20వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌ని పూరీ డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించడమే కాకుండా.. దర్శకుడిగా టాలీవుడ్‌లో ఒక మార్క్‌ని, ఒక స్టయిల్‌ని పూరి క్రియేట్ చేశాడు. పూరీతో సినిమా అంటే హీరోయిజం ఒక లెవల్‌లో ఉంటుందని హీరోలే కాకుండా ప్రేక్షకులందరూ అనుకునే స్థాయిని తెచ్చుకోగలిగారు. దర్శకుడిగా పూరీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకి అభినందనలు హోరెత్తుతున్నాయి. Updated Date - 2020-04-20T00:17:29+05:30 IST