నర్గిస్ కోరిక మేరకు రిషికపూర్ తెరంగేట్రం
ABN, First Publish Date - 2020-04-30T16:53:32+05:30
ప్రముఖ నటుడు రిషి కపూర్ ఈ ప్రపంచాన్ని వీడివెళ్లిపోయారు. 5 దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన రిషికపూర్ తొలిసారిగా...
ప్రముఖ నటుడు రిషి కపూర్ ఈ ప్రపంచాన్ని వీడివెళ్లిపోయారు. 5 దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన రిషికపూర్ తొలిసారిగా బాబీ చిత్రంతో హీరోగా తన సత్తా చాటారు. అయితే అతని మొదటి చిత్రం బాబీ కాదని, తన తండ్రి రాజ్ కపూర్ నటించిన శ్రీ 420 అని ఒక ఇంటర్వ్యూలో రిషికపూర్ స్వయంగా వెల్లడించారు. ఇందుకు హీరోయిన్ నర్గీస్ తనను ఎలా ఒప్పించారో రిషి కపూర్ స్వయంగా వెల్లడించారు. వాస్తవానికి రిషి కపూర్ శ్రీ 420 లో ప్యార్ హువా పాటలో కనిపించారు. ఈ పాటలో రాజ్ కపూర్, నర్గిస్ వెనుక వర్షంలో నడుస్తున్న ముగ్గురు పిల్లలలో రిషి కపూర్ ఒకరు. ఆ సమయంలో రిషికి 3 సంవత్సరాలు. రిషికి నర్గిస్ చాక్లెట్ ఇచ్చి ఈ పాటలో నటించేందుకు తీసుకువెళ్లారు. దీని తరువాత, రిషి కపూర్ మేరా నామ్ జోకర్ చిత్రంలో రాజ్ కపూర్ పాత్ర యంగ్ వెర్షన్ లో నటించారు.