గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్

ABN , First Publish Date - 2020-10-14T23:54:02+05:30 IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బుధ‌వారం రోజున ఇండియ‌న్‌ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఢిల్లీలోని సుందర్ నగర్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. ప‌లు రంగాలకు చెందిన ప్ర‌ముఖులు ఇందులో భాగ‌మ‌వుతున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా బుధ‌వారం రోజున ఇండియ‌న్‌ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఢిల్లీలోని సుందర్ నగర్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వాతావరణ కాలుష్యం తగ్గి మంచి వాతావరణం కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. అందుకోసం భారతీయులందరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. మన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించడం మన అందరి బాధ్యత’’ అన్నారు.

Updated Date - 2020-10-14T23:54:02+05:30 IST