తెలుగులోకి కన్నడ ‘పొగరు’

ABN , First Publish Date - 2020-07-27T12:13:16+05:30 IST

‘కరాబు... బాసు కరాబు’ - కన్నడ చిత్రం ‘పొగరు’లో ఈ పాటను ఇప్పటివరకూ యూట్యూబ్‌లో తొమ్మిది కోట్లమందికి పైగా వీక్షించారు. త్వరలో తెలుగులో విడుదల కానుందీ పాట. అంతే కాదు...

తెలుగులోకి కన్నడ ‘పొగరు’

‘కరాబు... బాసు కరాబు’ - కన్నడ చిత్రం ‘పొగరు’లో ఈ పాటను ఇప్పటివరకూ యూట్యూబ్‌లో తొమ్మిది కోట్లమందికి పైగా వీక్షించారు. త్వరలో తెలుగులో విడుదల కానుందీ పాట. అంతే కాదు... సినిమా కూడా తెలుగులోకి వస్తోంది. యాక్షన్‌ హీరో అర్జున్‌ మేనల్లుడు ధ్రువ్‌ సర్జా, కథానాయికగా తెలుగులో వరుస విజయాలతో దూసుకువెళుతున్న కన్నడ భామ రష్మికా మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం ‘పొగరు’. బి.కె. గంగాధర్‌ నిర్మాత. నందకిశోర్‌ దర్శకుడు. ‘‘పాన్‌ ఇండియన్‌ సినిమాగా ‘పొగరు’ రూపొందుతోంది. ఆగస్టు 6న చిత్రంలో తొలి పాట ‘కరాబు’ విడుదలతో తెలుగులో ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తాం. తెలుగు ప్రేక్షకులకూ తెలిసిన సంపత్‌ రాజ్‌, పవిత్రా లోకేశ్‌, ధనుంజయ్‌ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి చందన్‌శెట్టి సంగీత దర్శకుడు.


Updated Date - 2020-07-27T12:13:16+05:30 IST

Read more