వాటికి సమాధానం చెప్పారు: సుశాంత్ సోదరికి కంగన ధన్యవాదాలు!

ABN , First Publish Date - 2020-08-25T21:57:45+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ మృతిని హీరోయిన్ కంగనా రనౌత్ తన స్వలాభం కోసం ఉపయోగించుకుంటోందని

వాటికి సమాధానం చెప్పారు: సుశాంత్ సోదరికి కంగన ధన్యవాదాలు!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ మృతిని హీరోయిన్ కంగనా రనౌత్ తన స్వలాభం కోసం ఉపయోగించుకుంటోందని, తన స్వంత ఎజెండాతోనే బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. `బాయ్‌కాట్ కంగన` అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో కంగన గురించి సుశాంత్ ఫ్యామిలీ లాయర్ మాట్లాడిన వీడియోను శ్వేత షేర్ చేసింది. 


`మాకెవరికీ కంగనపై ఎలాంటి ఫిర్యాదులూ లేవు. సినీ పరిశ్రమలోని వివక్ష గురించి కంగన పోరాటం చేస్తోంది. సుశాంత్ కూడా ఆ వివక్ష బాధితుడే. అయితే సుశాంత్ మరణానికి, బాలీవుడ్‌లోని వివక్షకు ప్రత్యక్ష సంబంధం లేదని నేను గతంలో అన్నాను. ఒకవేళ సుశాంత్ మరణానికి అదే కారణమైతే సీబీఐ చూసుకుంటుంద`ని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియోపై కంగన స్పందిస్తూ.. `ధన్యవాదాలు శ్వేతా సింగ్. నా గురించి వస్తున్న అన్ని రూమర్లకు సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు` అని కంగన ట్వీట్ చేసింది. 
Updated Date - 2020-08-25T21:57:45+05:30 IST