రియా వారందరి పేర్లూ చెప్పాలి: కంగన

ABN , First Publish Date - 2020-09-08T22:39:18+05:30 IST

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.

రియా వారందరి పేర్లూ చెప్పాలి: కంగన

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడడంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే సుశాంత్ మేనేజర్ శామ్యూల్, రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ను అరెస్ట్ చేసింది. మూడ్రోజుల విచారణ అనంతరం రియాను కూడా తాజాగా అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


రియా అరెస్ట్ గురించి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడింది. `ఈ కేసులో రియాను బలిపశువును చేయబోతున్నారని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. ఆమె చిన్నపాటి గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసం మగాళ్లతో స్నేహం చేసే మహిళ) కావొచ్చు, డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చు. విచారణలో భాగంగా ఆమె అసలు రహస్యాలు బయటపెట్టాలి. సుశాంత్ మరణం వెనకున్న మాస్టర్ మైండ్స్ పేర్లు చెప్పాలి. అతని కెరీర్‌ను నాశనం చేసింది ఎవరు? అతని సినిమాలను లాగేసుకుందెవరు? అతనికి డ్రగ్స్ ఇచ్చిందెవరు? ఇప్పుడు ఆమె అవన్నీ బయపెట్టాల`ని కంగన అభిప్రాయపడింది. 

Updated Date - 2020-09-08T22:39:18+05:30 IST