ఈరోజు చాలా ప్రత్యేకమైనది: కంగన

ABN , First Publish Date - 2020-10-01T14:48:29+05:30 IST

లాక్‌డౌన్ సమయంలో పలు వివాదాలతో తీరిక లేకుండా గడిపిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇక షూటింగ్‌తో బిజీ కానుంది.

ఈరోజు చాలా ప్రత్యేకమైనది: కంగన

లాక్‌డౌన్ సమయంలో పలు వివాదాలతో తీరిక లేకుండా గడిపిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇక షూటింగ్‌తో బిజీ కానుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న `తలైవి` చిత్రంలో కంగన నటిస్తున్న సంగతి తెలిసిందే. 


లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన ఆ సినిమా షూటింగ్ ఈ రోజు (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ఆ షూటింగ్‌లో పాల్గొనడం గురించి కంగన తాజాగా ట్వీట్ చేసింది. `ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఏడు నెలల తర్వాత షూటింగ్‌లో పాల్గొంటున్నా. ఎంతో ఆసక్తికరమైన `తలైవి` సినిమా కోసం దక్షిణాదికి పయనమవుతున్నా. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మీ ఆశీర్వాదాలు కావాల`ని ట్వీట్ చేసింది. అలాగే ఉదయం తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేసింది. 




Updated Date - 2020-10-01T14:48:29+05:30 IST