అతని పద్మశ్రీ తీసేసుకోండి.. కరణ్ జోహార్‌పై కంగన ఫైర్!

ABN , First Publish Date - 2020-08-19T00:36:04+05:30 IST

బాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకడైన కరణ్ జోహార్‌పై క్వీన్ కంగనా రనౌత్ మండిపడ్డారు.

అతని పద్మశ్రీ తీసేసుకోండి.. కరణ్ జోహార్‌పై కంగన ఫైర్!

ముంబై: బాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకడైన కరణ్ జోహార్‌పై క్వీన్ కంగనా రనౌత్ మండిపడ్డారు. కరణ్‌కు భారత ప్రభుత్వం అందించిన పద్మశ్రీ అవార్డును తిరిగి తీసేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల కరణ్ నిర్మించిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ చిత్రంపై పలువురు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే సక్సేనా కోర్స్‌మేట్ విశ్రాంత ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీవిద్యా రాజన్ ఆ చిత్రంపై తీవ్రంగా స్పందించారు. వాస్తవాలను వక్రీకరించి చూపిస్తున్నారని చిత్ర బృందంపై మండిపడ్డారు. దీనిపై మాట్లాడిన కంగన.. ‘కరణ్ జోహార్ నన్ను బెదిరించాడు. ఉరి దాడులప్పుడు పాక్‌కు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు భారత ఆర్మీకి వ్యతిరేకంగా సినిమా తీశాడు. అతనికి ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అంటూ ట్వీట్ చేసింది.

Updated Date - 2020-08-19T00:36:04+05:30 IST