సుశాంత్‌ను వారే హత్య చేశారు: కంగనా

ABN , First Publish Date - 2020-06-16T01:11:55+05:30 IST

సుశాంత్ చాలా అద్భుతమైన నటుడు. ‘కైపోచె’ సినిమాకు బెస్ట్ డెబ్యూ అవార్డు రావాల్సి ఉంది. కానీ అవార్డు రానివ్వకుండా కొందరు పెద్దలు వెనుక తతంగం నడిపించారు. ఎన్నో అద్భుతమైన

సుశాంత్‌ను వారే హత్య చేశారు: కంగనా

సుశాంత్ చాలా అద్భుతమైన నటుడు. ‘కైపోచె’ సినిమాకు బెస్ట్ డెబ్యూ అవార్డు రావాల్సి ఉంది. కానీ అవార్డు రానివ్వకుండా కొందరు పెద్దలు వెనుక తతంగం నడిపించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు, ‘చిచ్చోరే’ వంటి సందేశాత్మక చిత్రం కూడా చేశాడు. అంతటి టాలెంటెడ్ యాక్టర్‌కు అవార్డు రాకపోవడం ఏంటి.? స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ సంపాదించిన వ్యక్తి మానసికంగా ఎలా బలహీనంగా ఉంటాడు? అంటూ సుశాంత్ మృతిపై సంచలన కామెంట్స్ చేసింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ట్విట్టర్ ద్వారా సుమారు రెండు నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేసిన కంగనా.. అందులో బాలీవుడ్‌ పెద్దలే సుశాంత్ మరణానికి కారణం అంటూ సంచలన ఆరోపణలు చేసింది. 


‘‘బాలీవుడ్‌లో కొత్తగా వచ్చేవారికి సపోర్ట్ చేయడం సంగతి పక్కన పెడితే వారిని పైకి రానీయకుండా కొందరు బాలీవుడ్ పెద్దలు తెరవెనుక ప్లాన్స్ చేస్తుంటారు. కొత్తగా వచ్చి సక్సెస్ అవుతున్నారని గమనిస్తే చాలు వారి సినిమాలకు రివ్యూస్ చెత్తగా ఉందని రాయించడం మొదలుకుని చాలా ప్రయోగాలు చేస్తారు. సుశాంత్ విషయానికి వస్తే.. అతనొక డ్రగ్ బానిస అని చిత్రీకరించడానికి కూడా కొందరు స్కెచ్‌లు వేశారు. తన సినిమాలు ఆడకపోతే తనని ఇండస్ట్రీలో ఉండనీయరని ఒకానొక సమయంలో సుశాంత్ తన సినిమాలు చూడండి అని అభిమానులకు విజ్ఞప్తి చేసే స్థాయికి తీసుకువచ్చారు. అతని మాటలను బట్టి చూస్తే.. అతని ఆత్మహత్యకు కారణం బాలీవుడ్ పెద్దలే. వారు పెట్టిన టార్చర్ వల్లే సుశాంత్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు..’’ అని కంగనా ఈ వీడియోలో బాలీవుడ్ పెద్దలపై మండిపడింది. Updated Date - 2020-06-16T01:11:55+05:30 IST