అనురాగ్‌పై కంగనా ఫైర్‌.. కానీ తాప్సీ మద్దతు

ABN , First Publish Date - 2020-09-20T18:15:26+05:30 IST

బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ తనను బలవంతం చేయడానికి ప్రయత్నించాడంటూ నటి పాయల్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

అనురాగ్‌పై కంగనా ఫైర్‌.. కానీ తాప్సీ మద్దతు

బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ తనను బలవంతం చేయడానికి ప్రయత్నించాడంటూ నటి పాయల్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అనురాగ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ అవుతుంది. కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో పాయల్‌ ఘోష్‌కు మద్దతు తెలియజేసింది. ప్రతి వాయిస్‌ చాలా ఇంపార్టెంట్‌ అంటూ మీ టూ హ్యాష్‌ ట్యాగ్‌తో పాటు, అరెస్ట్‌ అనురాగ్‌ కశ్యప్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కంగనా షేర్‌ చేసింది. "నువ్వొక పెద్ద స్త్రివాదివి. త్వరలోనే నిన్ను సెట్స్‌లో చూస్తానని భావిస్తున్నాను. ఈ ప్రపంచంలో స్త్రీ ఎంత శక్తివంతురాలో తెలియజేసేలా నువ్వొక విషయాన్ని క్రియేట్‌ చేస్తావని ఆశిస్తున్నాను" అంటూ తాప్సీ మాత్రం అనురాగ్‌ కశ్యప్‌కు మద్దతుని తెలియజేసింది. కొన్నిరోజులుగా కంగనా రనౌత్‌, తాప్సీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో కంగనా వ్యతిరేకిస్తున్న మనిషికి తాప్సీ మద్దతునివ్వడం టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 


Updated Date - 2020-09-20T18:15:26+05:30 IST