మీ తండ్రి సీఎం కావడమే `డర్టీ పాలిటిక్స్`కు ఉదాహరణ: ఆదిత్యపై కంగన ఫైర్

ABN , First Publish Date - 2020-08-05T22:34:42+05:30 IST

మాహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రేను బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ కడిగి పారేసింది.

మీ తండ్రి సీఎం కావడమే `డర్టీ పాలిటిక్స్`కు ఉదాహరణ: ఆదిత్యపై కంగన ఫైర్

మాహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రేను బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ కడిగి పారేసింది. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి విషయంలో  ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందని ఇటీవల కంగన ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇటీవల ఆదిత్య స్పందించారు. తన కుటుంబంపై కావాలనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ప్రతిపక్షాలు `మురికి రాజకీయాలు` చేస్తున్నాయని విమర్శించారు.


ఈ వ్యాఖ్యలపై తాజాగా కంగన డిజిటల్ టీమ్ వరుస ట్వీట్లు చేసింది. `చూడండి.. మురికి రాజకీయాల గురించి ఎవరు మాట్లాడుతున్నారో..! మీ తండ్రి సీఎం కావడమే `డర్టీ పాలిటిక్స్`కు మంచి ఉదాహరణ సర్. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని మీ తండ్రిని అడగండి` అని పలు ప్రశ్నలను ట్వీట్ చేసింది. 


1) రియా ఎక్కడ ఉంది?


2) సుశాంత్ అసహజ మరణంపై ముంబై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు?


3) ఫిబ్రవరి నెలలో సుశాంత్ జీవితం ప్రమాదంలో ఉందని ఫిర్యాదు అందినపుడు.. ముంబై పోలీసులు దీనిని మొదటి రోజే ఆత్మహత్య అని ఎలా నిర్ధారించారు?


4) ఐపీఎస్ వినయ్ తివారీని క్వారంటైన్ పేరిట ఎందుకు లాక్ చేశారు?


5) సిబీఐకి కేసు అప్పగించడానికి ఎందుకు భయపడుతున్నారు?


అంటూ పలు ప్రశ్నలను కంగన సంధించింది. ఈ ప్రశ్నలకు రాజకీయాలతో సంబంధం లేదని, దయచేసిన వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేసింది. 
Updated Date - 2020-08-05T22:34:42+05:30 IST