ఓటీటీలను అలాంటి సైట్స్‌తో పోల్చిన కంగనా
ABN , First Publish Date - 2020-10-23T15:36:55+05:30 IST
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ట్విట్టర్‌లో తనదైన శైలిలో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌ను పోర్స్ సైట్స్ అంటూ హాట్ కామెంట్స్ చేసింది.

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ట్విట్టర్‌లో తనదైన శైలిలో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌ను నీలి చిత్రాల సైట్స్ అంటూ హాట్ కామెంట్స్ చేసింది. డిజిటల్ మాధ్యమం ఈరోస్ నౌ సంస్థ సల్మాన్‌ఖాన్, రణవీర్ సింగ్, కత్రినాకైఫ్‌లతో ఉన్న మీమ్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత తొలగించేసింది. అయితే ఈ వ్యవహారంపై కంగనా మాత్రం మండిపడింది. డిలీట్ చేసిన మీమ్ ఫోటోను తన ట్విట్టర్‌లో షేర్ చేసిన కంగనా రనౌత్ ఓటీటీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. "సినిమాను థియేటర్‌లో చూసే ప్రేక్షకులను మనం కాపాడుకోవాలి. లైంగిక కంటెంట్‌తో ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించడం కష్టం. డిజిటలైజేషన్‌లో కళ పెద్ద సంక్షోబాన్ని ఎదుర్కొంటోంది. స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్ పోర్న్ హబ్స్ తప్ప మరేమీ కావు" అని అన్నారు కంగనా.
Read more