కొందరు భక్తిని అపహాస్యం చేస్తున్నారు: కంగనా

ABN , First Publish Date - 2020-10-12T16:14:25+05:30 IST

హాలీవుడ్‌ నటి సల్మా హయెక్‌ ఇటీవల తాను హిందూ దేవత లక్ష్మీదేవిని పూజిస్తానంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనికి బాలీవుడ్‌ బిగ్‌బాంగ్‌ కంగనా రనౌత్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

కొందరు భక్తిని అపహాస్యం చేస్తున్నారు:  కంగనా

హాలీవుడ్‌ నటి సల్మా హయెక్‌ ఇటీవల తాను హిందూ దేవత లక్ష్మీదేవిని పూజిస్తానంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనికి బాలీవుడ్‌ బిగ్‌బాంగ్‌ కంగనా రనౌత్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. భక్తి అనే అంశం గురించి మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్‌ను చేసింది కంగనా. "నేను ఊహించని విధంగా ప్రపంచంలో శివుడు, కృష్ణుడు, లేదా దేవీ భక్తులను కనుగొన్నాను. మతం లేదా జాతి గురించి చాలా మంది రాముడిని ప్రేమిస్తారు లేదా భగవద్గీతను అనుసరిస్తారు. కానీ భారతదేశంలో కొన్ని దురదృష్టకర ఆత్మలు భక్తిని అపహాస్యం చేస్తున్నారు. ఇక్కడ నేను ప్రస్తావించాలనుకున్న విషయం ఒకటే. మనం ఇక్కడ భక్తిని ఎంచుకోవడం లేదు. భక్తే మనల్ని ఎంచుకుంటోంది" అన్నారు కంగనా. ఇప్పుడు భక్తి, భక్తులను టార్గెట్‌ చేస్తూ హిందుత్వాన్ని సపోర్ట్‌ చేస్తూ చేసిన ఈ ట్వీట్‌ ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి. 
Updated Date - 2020-10-12T16:14:25+05:30 IST

Read more