‘తేజస్‌’ వర్క్‌షా్‌పలో కంగనా!

ABN , First Publish Date - 2020-10-28T06:51:43+05:30 IST

కొన్నిరోజుల క్రితమే ‘తలైవి’ షూటింగు పూర్తిచేసుకున్న కంగనా రనౌత్‌ తన తరువాతి సినిమా ‘తేజస్‌’ కోసం సిద్ధమవుతున్నారు...

‘తేజస్‌’ వర్క్‌షా్‌పలో కంగనా!

కొన్నిరోజుల క్రితమే ‘తలైవి’ షూటింగు పూర్తిచేసుకున్న కంగనా రనౌత్‌ తన తరువాతి సినిమా ‘తేజస్‌’ కోసం సిద్ధమవుతున్నారు. సర్వేశ్‌ మేవారా దర్శకత్వంలో రోనీస్ర్కూవాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కంగన భారత వైమానిక దళంలో మహిళా పైలట్‌గా కనిపిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుండడంతో ముందుగా వింగ్‌ కమాండర్‌ అభిజిత్‌ గోఖలే నిర్వహిస్తున్న వర్క్‌షాపులో దర్శకుడు సర్వేశ్‌ మేవారాతో కలసి కంగనా పాల్గొన్నారు. ఆ వీడియోను కంగన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘‘తేజస్‌’ చిత్రం కోసం వర్క్‌షాపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ కల్లా ‘తేజస్‌’ షూటింగు పూర్తిచేసి చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. 

Updated Date - 2020-10-28T06:51:43+05:30 IST