నా ఆఫీస్‌ను ధ్వంసం చేయబోతున్నారు: కంగన ట్వీట్

ABN , First Publish Date - 2020-09-07T22:28:15+05:30 IST

మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మధ్య ప్రారంభమైన వివాదం మరింత ముదురుతోంది.

నా ఆఫీస్‌ను ధ్వంసం చేయబోతున్నారు: కంగన ట్వీట్

మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మధ్య ప్రారంభమైన వివాదం మరింత ముదురుతోంది. ముంబైలోని తన `మణికర్ణిక ఫిల్మ్స్` ఆఫీస్‌పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది దాడి చేశారని, మంగళవారం దానిని ధ్వంసం చేయబోతున్నారని కంగన వరుస ట్వీట్లు చేసింది. 


`ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నా ఆఫీస్ కొలతలు, ఇతర వివరాలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్లను హింసించారు. అసభ్యంగా మాట్లాడారు. నా ఆఫీస్‌ను ధ్వంసం చేయబోతున్నట్టు సమాచారం ఇచ్చార`ని ట్వీట్ చేసింది. అనంతరం `నా దగ్గర అన్ని పేపర్లూ ఉన్నాయి. బీఎమ్‌సీ నుంచి అనుమతి తీసుకున్నాక చట్టబద్ధంగానే బిల్డింగ్‌ను నిర్మించాను. వాళ్లు ఈ రోజు నా ఆఫీస్‌కు వచ్చారు. ఎలాంటి నోటీసూ ఇవ్వకుండానే నా బిల్డింగ్‌ను కూల్చబోతున్నార`ని కంగన పేర్కొంది. 
Updated Date - 2020-09-07T22:28:15+05:30 IST