ప్రపంచంలోనే నేను కంఫర్ట్‌గా ఫీలయ్యేది అక్కడే.. : కంగనా రనౌత్
ABN , First Publish Date - 2020-10-05T15:37:30+05:30 IST
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆదివారం పునః ప్రారంభమైంది. ఈ విషయాన్ని కంగనా తెలియజేస్తూ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ తనకు సీన్ వివరిస్తున్న ఫొటోను షేర్ చేశారు.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో టైటిల్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆదివారం పునః ప్రారంభమైంది. ఈ విషయాన్ని కంగనా తెలియజేస్తూ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ తనకు సీన్ వివరిస్తున్న ఫొటోను షేర్ చేశారు. "టాలెంటెడ్ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ నాకు సీన్‌ను వివరిస్తున్నారు. ఈ ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ చాలా కంఫర్ట్ అయిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఫిలింసెట్ మాత్రమే" అని మెసేజ్ కూడా పోస్ట్ చేశారు కంగనా రనౌత్. సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ నెపోటిజం, డ్రగ్ మాఫియా తదితర అంశాలపై కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు.
Read more