హైదరాబాద్‌ ఎంతో అందంగా ఉంది: కంగనా

ABN , First Publish Date - 2020-10-12T17:55:20+05:30 IST

హైదరాబాద్‌ అందానికి కంగనా ఫిదా అయ్యింది.

హైదరాబాద్‌ ఎంతో అందంగా ఉంది:  కంగనా

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో రూపొందుతోన్న బయోపిక్‌ 'తలైవి'లో టైటిల్‌ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే హైదరాబాద్‌లో వేసిన అసెంబ్లీ సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్‌కు యూనిట్‌ సన్నద్ధమవుతుంది. ఈ గ్యాప్‌లో కంగనా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. హైదరాబాద్‌ అందానికి కంగనా ఫిదా అయ్యింది. "హైదరాబాద్‌ ఎంతో అందంగా ఉంది. అహ్లదకరంగా హిమాలయాలను తలపిస్తోంది. సూర్యోదయ సమయంలో ఈ అందం ఇంకా పెరుగుతోంది. చిన్నపాటి చలి, దానితోపాటు ఉండే వెచ్చదనం మనల్ని ఓ రకమైన మత్తులోకి తీసుకెళుతుంది" అంటూ కంగనా ఓ వీడియోను షేర్‌ చేసుకున్నారు. 
Updated Date - 2020-10-12T17:55:20+05:30 IST

Read more