ఎలుకలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి: కంగన
ABN , First Publish Date - 2020-08-25T17:55:45+05:30 IST
తనను అణగదొక్కేందుకు బాలీవుడ్ మాఫియా విశ్వ ప్రయత్నం చేస్తోందని ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్ ఆరోపించింది.

తనను అణగదొక్కేందుకు బాలీవుడ్ మాఫియా విశ్వ ప్రయత్నం చేస్తోందని ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్ ఆరోపించింది. కంగనకు వ్యతిరేకంగా `బాయ్‌కాట్ కంగన` హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. దీని గురించి కంగన తాజాగా స్పందించింది.
`అద్భుతం. ఎలుకలు ఇప్పుడు వాటి కలుగుల నుంచి బయటకు వస్తున్నాయి. `బాయ్‌కాట్ కంగన` హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. బాలీవుడ్ మాఫియా తను చేయగలిగింది చేయడానికి ప్రయత్నిస్తోంద`ని కంగన ట్వీట్ చేసింది. తన ట్విటర్ ఖాతాను కూడా నిలిపివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది జరిగే లోపే కొందరి వ్యవహరాలను బయటపెడతానని కంగన ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Read more